టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI ప్రణాళికలను పంచుకున్నారు. అంతే కాకుండా సూపర్ కంప్యూటర్‌ను తయారు చేయడానికి సంబంధించిన విషయాన్ని కూడా పంచుకున్నారు.
మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కోసం 2025 నాటికి సూపర్‌కంప్యూటర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని డెవలప్ చేయడానికి ఒరాకిల్‌తో భాగస్వామ్యాన్ని xAI పరిశీలిస్తోందని మస్క్ పేర్కొన్నారు. ఒరాకిల్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2025 చివరి నాటికి సూపర్ కంప్యూటర్ లాంచ్ అవుతుంది. రాబోయే సూపర్ కంప్యూటర్ ఎన్‌విడియా టాప్-ఆఫ్-ది-లైన్ H100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ల సమూహాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీపీయూ క్లస్టర్‌ల కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి వేగవంతమైన పనితీరును అందిస్తాయి.
ఇప్పటికే అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ, గూగుల్ ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి మస్క్ xAI స్థాపించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి మస్క్ సన్నద్ధమవుతున్నారు. ఇక రాబోయే సూపర్ కంప్యూటర్ ఎలా ఉండబోతోందో చూడాలంటే ఇంకో ఏడాది వేచి ఉండక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment