టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ఏఐ 'గ్రోక్' (Grok) పేరుతో తాజాగా ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీకి ఇది ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచం మొత్తం చాట్‌జీపీటీ వైపు చూస్తున్న సమయంలో మస్క్ తీసుకువచ్చిన ఈ కొత్త చాట్‌బాట్ తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు.
ఎక్స్ఏఐ ప్రారంభమైన కేవలం 8 నెలల్లో చాట్‌బాట్ తీసుకురావడం గమనార్హం. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యంతో కూడిన ఏఐ టూల్స్ వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతోనే 'గ్రోక్' అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) ప్లాట్‌ఫామ్ సాయంతో గ్రోక్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇతర ఏఐలు తిరస్కరించే ప్రశ్నలకు సైతం సమాధానం గ్రోక్ సమాధానం అందిస్తుందని మస్క్ వెల్లడించారు. మ్యాథ్స్, కోడింగ్ వంటి వాటికి సంబంధించిన అంశాలను కూడా ప్రత్యర్థుల కంటే మెరుగ్గా పరిష్కరించగలదని తెలిపారు. దీనిని 'ఎక్స్ ప్రీమియం ప్లస్' యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
గ్రోక్ ప్రస్తుతం ప్రాధమిక దశలోనే ఉండటం వల్ల, అమెరికాలో కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిని మరింత అభివృద్ధి చేసిన తరువాత మరింతమంది వినియోదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ 16 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1,330).
Comments
Please login to add a commentAdd a comment