ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్‌ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల
ఓపెన్‌ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్‌ఏఐలో ఆల్ట్‌మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్‌లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆల్ట్‌మన్ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.
అయితే, ఓపెన్‌ఏఐలోని పెట్టుబడి దారులు శామ్ ఆల్ట్‌మన్‌ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో చేరడం కంటే, తిరిగి ఓపెన్‌ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది.
చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్‌ఏఐకి ఎదురు దెబ్బ!
Comments
Please login to add a commentAdd a comment