గ్లోబల్ ఐటీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మార్కెట్ విలువ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్‌ను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కంపెనీ ఈ పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఎక్సేంజ్‌లో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 1.3 శాతం పెరిగి 403.78 డాలర్లకు చేరుకుంది.
కంపెనీ షేర్ విలువ పెరగడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. గతంలో 3 ట్రిలియన్ మార్కెట్ విలువను సాధించిన మొదటి కంపెనీగా యాపిల్ చేరింది. ఇప్పుడు అలాంటి రికార్డును తాజాగా మైక్రోసాఫ్ట్ కైవసం చేసుకుంది. ఇక యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం.. కంపెనీ ముందుకు దూసుకెళ్లడానికి, వృద్ధి సాధించడానికి కారణమవుతోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధిని సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ, యాపిల్ కంపెనీని అధిగమిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment