మహీంద్రా నుంచి ఇ-సుప్రో వ్యాన్స్ | Mahindra launches eSupro all electric cargo and passenger van in India | Sakshi
Sakshi News home page

మహీంద్రా నుంచి ఇ-సుప్రో వ్యాన్స్

Published Thu, Oct 6 2016 11:17 PM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

మహీంద్రా నుంచి ఇ-సుప్రో వ్యాన్స్ - Sakshi

మహీంద్రా నుంచి ఇ-సుప్రో వ్యాన్స్

న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో వ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ (ఇ-సుప్రో)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది కార్గో, ప్యాసింజర్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. జీరో ఎమిషన్ వెహికల్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకునే లక్ష్యంలో భాగంగా కంపెనీ ఈ వాహనాలను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇ-సుప్రో కార్గో వ్యాన్ ప్రారంభ ధర రూ.8.45 లక్షలుగా ఉంది.

ఇక ఇ-సుప్రో ప్యాసింజర్ వ్యాన్ ధర రూ.8.75 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. బ్యాటరీ ఫుల్ చార్జ్‌కి 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుందని, ఒక ఫుల్ చార్జ్‌తో ఈ వాహనాలు 112 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. కంపెనీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన మూడవ వాహనం ఇది. మహీంద్రా ఇదివరకే ఇ-20, ఇ-వెరిటో అనే రెండు వాహనాలను మార్కెట్‌లోకి తె చ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement