
చండీగఢ్/కోల్‌కతా: దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఏడో తేదీ నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ శాఖ తెలిపింది. లిక్కర్ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యమే అందుబాటులో ఉంటుంది. 21 వయసు దాటిన వారికి మద్యం డెలివరీ చేసేలా రూపొందించిన వెబ్‌సైట్‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ప్రారంభించింది. మద్యం షాపుల వద్ద తాకిడిని తగ్గించేందుకే సైట్ ప్రారంభించింది. చదవండి: తెలంగాణలో మద్యం జాతర
Comments
Please login to add a commentAdd a comment