న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో కీలకంగా వ్యవహిరించే కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ షాక్ ఇచ్చింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్, ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్న కాంగెస్ పార్టీ ఓ పనికిరాని పార్టీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ అసహజమైంది’ అని కర్ణాటక బీజేపీ నేత ఆర్.అశోక్ తీవ్ర విమర్శలు చేశారు.
‘కాంగ్రెస్ కూటమి చాలా అసహజమైంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు.. టీఎంసీ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయి. కొన్ని రోజులు క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ, సీపీఎం కర్యర్తులు ఘర్షణకు దిగారు. ఆ విషయం సీఎం మమతాకు తెలుసు’ అని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మండిపడ్డారు.
‘ప్రతిపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి ముక్కలైంది. సీఎం మమతా బెనర్జీ, నితేష్ కుమార్, అఖిలేష్ లాంటి నేతలు లేకుండా ఉంటే.. అదేం కూటమి?. మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది’ అని కర్ణాటక బీజేపీ నేత బస్వరాజ్ బొమ్మై విమర్శించారు.
కొన్ని పార్టీలు ఈడీ, సీబీఐకి బయపడి ‘ఇండియా కూటమి’లో చేరాయి. మమతా చేసిన ఒంటరి పోరు ప్రకటనే దీనికి నిదర్శనం. కాంగ్రెస్ మమతా పెద్ద షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ భారత్ నాయ్య యాత్ర పేరుతో కనీసం కూటమిలోని విపక్షాలను ఏకం చేయలేకపోయారు. దేశం మొత్తాన్ని ఎలా ఏకం చేస్తారు? ’ అని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఎద్దేవా చేశారు.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము ఒంటరిగానే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. పంజాబ్‌లో ఉన్న 13 పార్లమెంట్ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక.. ప్రతిపక్షాల కూటమిలో కీలకంగా వ్యవహరిస్తాయనుకున్న టీఎంసీ, ఆప్ పార్టీలు మొదట కూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహించాలని ప్రతిపాదించటం గమనార్హం. అటువంటి పార్టీలే తాము తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించటంలో ఆయా పార్టీల్లో, కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment