కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి కూటమిలో కీలకమైన భాగస్వామ్య పార్టీగా వ్యవహరిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున బెర్హంపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరీ గెలుపొందిన విషయం తెలిసిందే. బెర్హంపూర్ సెగ్మెంట్‌లో కూడా టీఎంసీ తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడుతామని యోచిస్తున్నట్లు సమాచారం.
‘ఇండియా కూటమీ’ లో భాగస్వామ్య పార్టీ అయిన టీఎంసీ.. మొదటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే అనూహ్యంగా అన్ని స్థానాల్లో(42) టీఎంసీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టీఎంసీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్, ‘ఇండియా కూటమి’లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ 22, బీజేపీ18, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: ‘జమిలి ఎన్నికలు.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకం’
Comments
Please login to add a commentAdd a comment