కడప కార్పొరేషన్: నగరంలోని మయూరా గార్డేనియాలో జాతర డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్, కొత్తాస్ ఎండీ నాగకుమార్, మిత్ర యోగాసెంటర్ రంగనాథ్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తూవులు, ట్యాబ్లెట్స్ వంటి వాటిని హోం డెలీవరి చేయడానికి ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏ వస్తూవులను బుక్ చేసుకున్నా అవి హోం డెలీవరి చేయబడుతాయని తెలిపారు. కార్యక్రమంలో జాతర డాట్ కామ్ ఎండీ అశోక్, మేనేజర్ నాగరాజు, డైరెక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జాతర డాట్ కామ్ వెబ్‌సైట్ ప్రారంభం
Published Sun, Aug 28 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
Advertisement
Advertisement