![Seven Hindi Movie Will Release On OTT Platform Due To Lockdown - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/30/Akshay.jpg.webp?itok=RDOm3neT)
ప్రస్తుతం ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే వినోదాన్ని హోమ్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేసింది ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ డిస్నీ హాట్‌స్టార్. ‘బాలీవుడ్‌కీ హోమ్‌డెలివరీ’ అంటూ ఏడు హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’, అజయ్ దేవగన్ ‘భూజ్’, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్‌బుల్’, సంజయ్ దత్ ‘సడక్ 2’, సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ ‘దిల్ బేచారా’, విద్యుత్ జమాల్ ‘ఖుదా హాఫీజ్’, కునాల్ కేము ‘లూట్ కేస్’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. జూలై నుంచి అక్టోబర్ నెలవరకూ ఈ సినిమాలను ప్రసారం చేయనున్నట్టు హాట్‌స్టార్ తెలిపింది. ఇందులో ‘దిల్ బేచారా’ మొదటిగా జూలై 24న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ‘బాలీవుడ్‌కీ హోమ్‌డెలివరీ’ సంబంధించి అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ను హోస్ట్ చేశారు వరుణ్ ధావన్. ఈ ఈవెంట్‌కి తమని ఆహ్వానించలేదని విద్యుత్ జమాల్, కునాల్ కేము ట్వీటర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment