ముంబై: మద్యం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు, డ్రంకెన్ డ్రైవ్‌లకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. ‘డ్రంకెన్ డ్రైవ్ ఘటనలను తగ్గించాలని నిర్ణయించాం. దీనికోసం మద్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించాం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్‌కులే ఆదివారం తెలిపారు. ఈ విధానం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయం వెల్లడించలేదు.
దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పక్కనున్న 3వేల లిక్కర్ దుకాణాలు మూతబడ్డాయి. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో ఆ ప్రభావం కూడా ఖజానాపై పడింది. దీంతో ఆదాయాన్ని పెంచుకు నేందుకు మద్యం ఆన్‌లైన్ విక్రయాలు, హోం డెలివరీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది’ అని తెలిపారు. అయితే, మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మద్యాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించాలనేది ఓ ప్రతిపాదన మాత్రమేనని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment