Maharashtra Beer And Liquor Sales Increased In Last 6 Months, Details Inside - Sakshi
Sakshi News home page

వామ్మో!.. ఆరు నెలల్లోనే.. 16 కోట్ల లీటర్ల బీరు తాగేశారు..

Published Mon, Oct 17 2022 2:27 PM | Last Updated on Mon, Oct 17 2022 4:17 PM

Beer And Liquor Sales Increased in Maharashtra In Last 6 Months - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల గణనీయంగా తగ్గిపోయిన మద్యం విక్రయాలు ఇప్పుడు అంతకు రెట్టింపు జోరందుకున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల మద్యం విక్రయాలతో పోలిస్తే యువతకు అత్యంత ప్రియమైన బీరు విక్రయాలు గణనీయంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే ఆరు నెలల్లో 81 శాతం బీరు విక్రయాలు అదికంగా జరిగాయి. ఈ విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి సుమారు రూ.10 వేల కోట్లు రెవెన్యూ వచ్చిందని రాష్ట్ర ఆదాయ శాఖలో నమోదైన గుణంకాలను బట్టి తెలిసింది. 

కరోనాతో పడిపోయిన అమ్మకాలు... 
కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 90 శాతం జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేగాకుండా వాణిజ్య సంస్థలు, షాపులు, కార్యాలయాలు, పబ్‌లు, బార్లు మూసి ఉండటంతో ఎలాంటి పార్టీలు జరగలేదు. దీని ప్రభావం మద్యం విక్రయాలపై తీవ్రంగా చూపింది. కానీ ఈ ఏడాది గణనీయంగా మద్యం అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో 16.90 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది.

అదే గత సంవత్సరం ఇదే కాలంలో 9.32 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది. అదే విధంగా ఈ ఏడాది ముంబైలో ప్రజలకు ప్రియమైన వైన్, మద్యం విక్రయాలు 51.52 శాతం పెరిగింది. ఆరు నెలల కాలంలో ఏకంగా 49 లక్షల లీటర్ల వైన్‌ విక్రయం జరగ్గా గత సంవత్సరం ఆరు నెలల కాలంలో 32.4 లక్షల లీటర్ల వైన్‌ విక్రయం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వైన్‌కు చాలా డిమాండ్‌ ఉందని విక్రయాలను బట్టి స్పష్టమవుతోంది. అదేవిధంగా విదేశీ మద్యం గత సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబరు మధ్య కాలంలో 10.34 కోట్ల లీటర్ల మద్యం విక్రయం జరగ్గా ఈ సారి 12.97 కోట్ల లీటర్లకు చేరింది.

దేశీ మద్యం విక్రయాలు 15 కోట్ల లీటర్ల నుంచి 18.94 లీటర్లకు చేరింది. దేశీ, విదేశీ విక్రయాల్లో సుమారు 26 శాతం పెరిగిందని స్పష్టమైతోంది. మద్యం విక్రయాలు పెరగడంవల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖాజనాలోకి భారీగా ఆదాయం వచ్చి చేరుతోంది. 2022 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి సుమారు రూ.10 వేల 34 కోట్ల ఆదాయం వచి్చంది. అదే గత సంవత్సరం ఇదే సమయంలో సుమారు రూ.7.198 కోట్ల ఆదాయం వచ్చింది. దీన్ని ఈ ఏడాది ఏకంగా 39.4 శాతం ఆదాయం అదనంగా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. 

కరోనా కాలంలో బీరు విక్రయాలు 33 శాతం మేర తగ్గిపోయాయి. రాష్ట్రంలో 2019–20 లో 29 కోట్ల 79 లక్షల లీటర్ల బీరు విక్రయం జరిగింది. అదే కరోనా లాక్‌డైన్‌ కాలంలో అంటే 2020–21లో బీరు విక్రయం 20 కోట్ల లీటర్లకు పడిపోయింది. అదే 2021–22లో రాష్ట్ర వ్యాప్తంగా 23.13 లక్షల లీటర్ల బీరు విక్రయం జరిగింది. గత సంవత్సరం జనవరి నుంచి జూన్‌ వరకు 9 కోట్ల 32 లక్షల లీటర్ల బీరు అమ్ముడు పోయింది. కానీ ఈ ఏడాది 81 శాతానికి పెరిగి ఆరు నెలల్లో 16 కోట్ల 90 లక్షల లీటర్లకు చేరుకుంది. ఇందులో అధిక అంటే 145 శాతం విక్రయం పర్భణి జిల్లాలోనే జరిగింది. ఆ తరువాత హింగోళి 125 శాతం, నాగ్‌పూర్‌లో 120 శాతం, యవత్మాల్‌లో 111 శాతం, నాసిక్, పుణే జిల్లాల్లో 109 శాతం, బీడ్‌లో 108 శాతం పెరిగినట్లు నమోదైంది.  

ముంబైకర్లు బీరు ప్రియులు... 
ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఎండ తాపం, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరణ కారణంగా ముంబై, మహారాష్ట్రలో బీర్‌ వినియోగం పెరిగింది. ముంబై నగరం, సబర్బన్‌ జిల్లాల్లో అమ్మకాలు 157.93% పెరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ మేలో 2020 సంబంధిత కాలంతో పోలిస్తే. మహారాష్ట్రలో, అదే వ్యవధిలో బీర్‌ అమ్మకాలు 199.25% పెరిగాయి. ఏప్రిల్‌ మే 2022లో, ముంబైవాసులు.. ముంబై నగరం సబర్బన్‌ జిల్లాల్లో వరుసగా 31.64 లక్షల బల్క్‌ లీటర్లు (ఎల్‌బీఎల్‌) 97.94 (ఎల్‌బీఎల్‌) బీర్‌ తాగారు, గత సంవత్సరం ఇదే కాలంలో 12.27, 48.17 కంటే తక్కువ. కోవిడ్‌ –19 పరిమితుల సడలింపు తర్వాత ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరణ కారణంగా తీవ్రమైన వేసవి వేడి, ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి రావడంతో ఈ వృద్ధి కనబడిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ పరిశ్రమల వర్గాల అధికారులు గుర్తించారు. బీర్‌ ధరలు ఎక్కువగా ఉన్నందున, వినియోగదారులు ఇతర చౌక మద్యం తాగడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిసింది.  

ఎందుకంటే ఇది తక్కువ ధరలోనే ‘కిక్‌’ లేదా అధిక భావనను ఇస్తుంది. ముంబై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గత వేసవిలో వేడి తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బీర్‌ వినియోగానికి ఇది సరైన సమయంగా మద్యం ప్రియులు భావించారని మహారాష్ట్ర వైన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ దిలీప్‌ గియానాని అన్నారు. బీర్‌ తాగడం వల్ల కొన్ని వైన్‌ షాపుల్లో బీర్‌ నిల్వలు తగ్గాయని, విపరీతమైన డిమాండ్‌ నెలకొందని ఆయన అన్నారు. ఇండియన్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివానంద్‌ శెట్టి కూడా ఈ వాదనతో ఏకీభవించారు.  సాధారణంగా వేసవిలో బీర్‌ వినియోగం పెరుగుతుందని, గత సంవత్సరం, కోవిడ్‌–19 పరిమితుల కారణంగా అమ్మకాలు తీవ్రంగా పడిపోయి, వ్యాపారాలు దివాళా తీశాయని  ఆయన చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement