
సాక్షి ముంబై: యావత్మాల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఏడుగురు మృతి చెందడంతో కలకలం రేగింది. జిల్లాలోని వణీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరోవైపు శానిటైజర్ తాగిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో వీరంతా శానిటైజర్ సేవించారని తెలిసింది. ఏడుగురిలో ముగ్గురు ఇంట్లోనే మృతి చెందినప్పటికీ మిగతావారు మాత్రం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం మృతి చెందారు.
చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు శానిటైజర్ సేవించడం వల్లే మృతిచెందారని, మరో ముగ్గురు అలాంటి లక్షణాలతోనే మృత్యువాత పడ్డారని వైద్యులు తెలిపారు. మృతులను దత్తా లాంజేవార్, నూతన్ పాథరటకర్, గణేష్ నాదేకర్, సంతోష్ మెహర్, సునీల్‌లుగా గుర్తించారు.
చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment