
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. చూస్తే కళ్లకు ఎంత ఇంపుగా ఉంటుందో తిన్నా కళ్లకు అంతే మేలు చేసే మామిడితో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో కొన్ని.
►మామిడిలో బీటా–కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. అది కంటిచూపును చాలాకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది.
►మామిడిలో కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్ డీజనరేషన్’ ముప్పును నివారించగల శక్తి ఉంది.
►మామిడిలోని ఆ బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియాతో పాటు ఇంకా అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. పెద్దపేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలనూ నివారిస్తుంది.
►మామిడిలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి మంచి రోగనిరోధక శక్తి సమకూరుతుంది.
►మామిడిలో పీచు ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని స్వాభావికంగానే నివారిస్తుంది. అంతేకాదు... జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.
►రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పాళ్లను కూడా తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది.
► మామిడిలో ఉండే పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల అది రక్తపోటును నివారిస్తుంది
►మామిడి గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)ను రాకుండా చేస్తుంది.
►చర్మానికి నిగారింపును ఇచ్చి మిలమిలలాడేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment