అందుకే విడాకులు తీసుకున్నాం : మలైకా | Malaika Arora Reveals About Her Divorce With Arbaaz Khan | Sakshi
Sakshi News home page

అందుకే విడాకులు తీసుకున్నాం : మలైకా

Published Wed, Feb 20 2019 12:06 PM | Last Updated on Wed, Feb 20 2019 12:08 PM

Malaika Arora Reveals About Her Divorce With Arbaaz Khan - Sakshi

పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్‌ జంట మలైకా అరోరా- అర్బాజ్‌ ఖాన్‌ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల విషయంలో మొదట కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నానని మలైకా తాజాగా వ్యాఖ్యానించారు. తన స్నేహితురాలు కరీనా కపూర్‌ హోస్ట్‌ చేసిన ఓ రేడియో షోలో ఆమె మాట్లాడుతూ... ‘ నేను విడాకులు తీసుకునే ముందు రోజు రాత్రి కూడా.. నా కుటుంబం మొత్తం నా చుట్టూ కూర్చొని నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. అసలు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముందంటూ అందరూ ప్రశ్నించారు. ఈ విషయంలో మరోసారి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే నా ఇబ్బందిని పూర్తిగా అర్థం చేసుకున్న అనంతరం.. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మా దృష్టిలో నువ్వెల్లప్పుడూ ధైర్య వంతురాలైన మహిళగానే ఉండిపోతావు అని భుజం తట్టారు. ఆ సమయంలో వారి మద్దతు నాకెంతో సాంత్వన కలిగించింది’ అని చెప్పుకొచ్చారు.

తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ...‘మేమిద్దరం(మలైకా-అర్బాజ్‌) ఒకరినొకరం అస్సలు సంతోషంగా ఉంచలేకపోయాం. ప్రతీ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తేవి. ఈ కారణంగా మాతో పాటు మా చుట్టూ ఉన్న వాళ్లకు కూడా ఇబ్బంది కలిగింది. అది వారిపై ప్రభావం చూపింది. అందుకే విడాకులు తీసుకున్నాం’ అని మలైకా పేర్కొన్నారు. కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ కారణంగానే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని బీ- టౌన్‌లో వార్తలు వినిపించాయి. విడాకులకు ముందు గుట్టుచప్పుడుగా ఉన్న మలైకా- అర్జున్‌లు ఇటీవల బాహాటంగానే కలిసి తిరుగుతున్నారు. ఇక అర్బాజ్‌ ఖాన్‌ కూడా జార్జియా ఆండ్రియానితో డేటింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement