
‘ఓహ్ మై గాడ్.. నువ్వు మీ నాన్నకు అచ్చం జిరాక్స్ కాపీలాగా ఉన్నావ్’ అంటూ బాలీవుడ్ నటి మలైకా అరోరా తన కుమారుడి ఫోటోను, మాజీ భర్త అర్బాజ్‌ఖాన్ చిన్నప్పటి ఫోటోను పక్కపక్కనే పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అర్బాజ్‌ఖాన్‌ను కూడా ట్యాగ్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. మలైకా, అర్బాజ్‌ఖాన్‌లకు 1998లో వివాహం కాగా వీరు 2017లో విడిపోయారు. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అర్బాజ్‌తో విడిపోయాక కొన్నాళ్లకు ‘అవును నేను అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నానని బాంబు పేల్చింది’ మలైకా.
తాజాగా వీరి పెళ్లిపై వస్తున్న పుకార్లపై మలైకా స్పందిస్తూ.. ‘అర్జున్ కపూర్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదు’ అని స్పష్టం చేశారు. తన కొడుకు అర్హాన్ భవిష్యత్తును గూర్చి ప్రస్తావిస్తూ.. ‘అతనికి సినిమాలు చూడటం, వాటిని అనుసరించడమంటే ఇష్టమని, దానికి అతను పెరిగిన వాతావరణం ఒక కారణం’ అని చెప్పుకొచ్చారు. అయితే అర్హాన్ భవిష్యత్తులో ఏమవుతాడో అనే దానిపై అతనికి స్పష్టత లేదని, ప్రస్తుతానికి తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు. అర్బాజ్‌ఖాన్ కూడా ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో నాకు మలైకాకు మధ్య ఉన్న బంధం అర్హాన్ మాత్రమేనని, ఇప్పటికీ మలైకాతో మంచి రిలేషన్ ఉందని పేర్కొన్నారు. అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో డేటింగ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment