Arjun Kapoor Breakup With Malaika Arora Rumours: See His Reaction, Goes Viral - Sakshi
Sakshi News home page

Arjun Kapoor And Malaika Arora: బ్రేకప్‌ చెప్పుకున్న లవ్‌బర్డ్స్‌!, క్లారిటీ ఇచ్చిన హీరో

Published Wed, Jan 12 2022 9:19 PM | Last Updated on Thu, Jan 13 2022 12:24 PM

Arjun Kapoor Clarity On Rumours Over His Break Up With Malaika Arora - Sakshi

Arjun Kapoor Clarity Over His Break Up With Malaika Arora!: బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ప్రముఖ నటి మలైకా అరోరాతో కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్‌ కపూర్‌కు 36 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అర్జున్‌ సినిమాల పరంగా కంటే తనకన్నా వయసులో పెద్దదైన మలైకతో ప్రేమ వ్యవహరంతో కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు ఆంటీతో డేటింగ్‌ ఏంటని కూడా తరచూ అతడు ట్రోల్స్‌ బారిన పడుతున్నాడు.

చదవండి: Arjun Kapoor: ఆంటీతో డేటింగ్‌ అంటూ ట్రోల్స్‌, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్‌ హీరో

అయితే అవన్నీ చూసి చూడనంటూ వదిలేస్తన్నారు ఈ లవ్‌ బర్డ్స్‌. అంతేకాదు తమను ట్రోల్స్‌ చేస్తున్న వారికి.. ప్రేమతో వయసుకు సంబంధం లేదని, తమకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందంటూ కౌంటర్‌గా కొటెషన్స్‌ చెప్పుకుంటు వస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోయారంటూ, తమ ప్రేమకు బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ బి-టౌన్‌లో జోరుగా ప్రచారం  జరుగుతోంది.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

ఇంతకాలం ప్రేమ గురించి కవితలు, కొటెషన్స్‌ చెప్పుకొచ్చిన ఈ జంట కూడా అందరిలాగే విడిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తమపై వచ్చిన తాజా రూమార్లకు చెక్‌ పెడుతూ అర్జున్‌ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు. మలైకాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన అర్జున్ కపూర్.. చెత్త పుకార్లకు చోటు లేదంటూ తేల్చి చెప్పాడు. ‘నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్’ అనే క్యాప్షన్‌తో రూమర్లకు స్పష్టత ఇచ్చాడు అర్జున్‌ కపూర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement