కఠ్మాండు: నేపాల్‌లో వాతావరణం అనుకూలించక 18 మందితో వెళుతున్న ఓ చిన్న విమానం కూలిపోయింది. నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆదివారం పొఖారా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.40కి బయలు దేరిందని తర్వాత 15 నిమిషాలకు దాని నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయని అధికారులు తెలిపారు. విమానంలో ఓ విదేశీయుడు సహా 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్గాకంచి జిల్లాలోని ఖిదిమ్ అటవీ ప్రాంతంలో విమానం శకలాలు కని పించాయని, అందులో ఉన్న 18 మందీ మృతిచెంది ఉంటారని భావిస్తున్నామని అధికారులు చెప్పారు.
పీవీ, సోనియాల మధ్య విభేదాలు!
తన తాజా పుస్తకంలో కేంద్ర మంత్రి థామస్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య రాజీవ్‌గాంధీ హత్యకేసు దర్యాప్తు విషయంలో అప్పట్లో తీవ్ర మనస్పర్ధలు చోటు చేసుకున్నాయట. సొంత పార్టీకి చెంది న పీవీ ప్రధానిగా ఉన్నా.. రాజీవ్ హత్యకేసు దర్యాప్తు నత్తనడకన నడుస్తోందని సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. తరచూ తనకు అవమానం జరుగుతోందంటూ పీవీ ఆవేదన చెందారట. దీంతో ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉండేవికావని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ వెల్లడించారు. ‘సోనియా- ద బిలవ్డ్ ఆఫ్ ద మాసెస్ (సోనియా-జన ప్రియతమ నేత)’ పేరుతో రాసిన తన తాజా పుస్తకంలో థామస్ పలు విషయాలు పేర్కొన్నారు.
నేపాల్‌లో కూలిన విమానం
Published Mon, Feb 17 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement