
వన్డేల్లో తన పునరాగమనంపై అంత తొందరేం లేదని, సమయం వచ్చినపుడు తప్పకుండా అవకాశం లభిస్తుందని భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వన్డే ఫార్మాట్‌లో తన ప్రదర్శన మెరుగ్గానే ఉందని, మరీ తీసికట్టుగా ఏం లేదని అతను అభిప్రాయపడ్డాడు. ఏదో ఒకరోజు తిరిగి వన్డే జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో అశ్విన్‌ను ఎంపిక చేయలేదు.