మంగళవారం(జనవరి 3) శ్రీలంకతో జరిగిన తొలి టీ20 టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మాన్ గిల్ తన టీ20 అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన డెబ్యూ మ్యాచ్‌లోనే గిల్ నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అతడు కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. గిల్ ఆటతీరు టీ20లకు కాకుండా లాంగ్ ఫార్మాట్(టెస్టులు, వన్డేలు)కు మాత్రమే సరిపోతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు.
"శుబ్‌మాన్ గిల్‌కు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. అతడు తన అరంగేట్ర సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తే.. రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం లభిస్తుంది. అయితే నా దృష్టిలో మాత్రం గిల్ ఎప్పటికీ లాంగ్ ఫార్మాట్ ఆటగాడే. ఎందుకంటే అతడు ఆడే విధానం టీ20 క్రికెట్‌కు సెట్‌కాదు.
గిల్‌కు టెస్టులు, వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. శుబ్‌మాన్ భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌లో కెప్టెన్ కూడా కావచ్చు. అదే విధంగా అతడికి చాలా కాలం పాటు భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి వన్డేల్లో గిల్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: PAK vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ పేసర్ వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment