Mohammed Siraj becomes highest ODI wicket taker for India in 2022 - Sakshi
Sakshi News home page

BAN vs IND: మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

Published Wed, Dec 7 2022 4:01 PM | Last Updated on Wed, Dec 7 2022 4:40 PM

Mohammed Siraj becomes highest wicket taker for India in ODIs - Sakshi

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో అనముల్ హక్ ఔట్ చేసిన సిరాజ్‌.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ 23 వికెట్లు సాధించాడు.

ఇక అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చాహల్‌ రికార్డును సిరాజ్‌ బ్రేక్‌ చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో 14 మ్యాచ్‌లు ఆడిన చాహల్‌ 21 వికెట్లు పడగొట్టాడు.

సెంచరీతో చెలరేగిన మెహాదీ హసన్‌
ఇక కీలకమైన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ‍కేవలం 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మహ్మదుల్లా, మెహాదీ హసన్‌ అదుకున్నారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 147 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు.

ఇక  ఈ మ్యాచ్‌లో మెహాదీ హసన్‌  ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న  మెహాదీ హసన్‌ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా  మెహాదీ హసన్‌ కూడా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు, ఉమ్రాన్‌ మాలిక్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోకు ఘోర అవమానం? పాపం.. బెంచ్‌ మీద కూర్చుని నిర్లిప్తతతో.. సిగ్గుచేటు అంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement