రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా ప్రపంచరికార్డును టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా భారత్ అవతరించింది. టీమిండియా ఇప్పటివరకు 213 మ్యాచ్‌ల్లో 136 విజయాలను అందుకుంది.
కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. పాకిస్తాన్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించింది. తాజా మ్యాచ్‌తో పాక్ వరల్డ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్‌లో 9 వికెట్ల నష్టానికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.
రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. రింకూతో పాటు జితేష్ శర్మ(35), యశస్వీ జైశ్వాల్(37), రుతురాజ్ గైక్వాడ్(32) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ వేడ్(36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment