
ఇంగ్లండ్ సెల్ఫ్ గోల్
ఫైనల్లో జపాన్
మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్
ఎడ్మాంటన్ (కెనడా): ఇంజ్యురీ సమయంలో చేసిన తప్పిదంతో ఇంగ్లండ్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆశలకు గండి పడింది. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో 1-2తో ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ జట్టు అమెరికాతో తలపడుతుంది. మ్యాచ్ అదనపు సమయం రెండో నిమిషంలో ఇంగ్లండ్ డిఫెండర్ లారా బాసెట్ బంతిని గోల్‌పోస్టు పైనుంచి పంపాలని ప్రయత్నించినా అది బార్‌కు తగిలి లోపలే పడింది.
దీంతో జపాన్ సంబరాల్లో మునిగిపోగా.. తొలిసారి సెమీస్‌లోకి వ చ్చిన ఇంగ్లండ్ విషాదంలో మునిగింది. అంతకుముందు 33వ నిమిషంలో జపాన్ కెప్టెన్ అయా మియామా పెనాల్టీ ద్వారా గోల్ చేయగా ఇంగ్లండ్‌కు కూడా ఫారా విలియమ్స్ (40వ ని.) పెనాల్టీ కిక్ ద్వారా గోల్ అందించింది.