‘క్షమించండి’ | England players urinate on Oval pitch during Ashes celebrations | Sakshi
Sakshi News home page

‘క్షమించండి’

Published Thu, Aug 29 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

England players urinate on Oval pitch during Ashes celebrations

లండన్: ఓవల్ పిచ్‌పై తమ క్రికెటర్లు మూత్ర విసర్జన చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఇంగ్లండ్ జట్టు క్షమాపణలు చెప్పింది. క్రికెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను తాము చాలా గౌరవిస్తామని తెలిపింది. ‘మాపై ఆడిన ప్రత్యర్థులన్నా, మేం ఆడిన మైదానాలన్నా మాకు చాలా గౌరవం.

గొప్ప సిరీస్ గెలిచిన ఆనందంలోనూ మేం ఈ విషయాలను మర్చిపోకూడదు. అయితే కొంత మంది ప్రవర్తించిన తీరుమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా సంబరాల్లో జరిగిన తప్పిదానికి మేం క్షమాపణలు కోరుతున్నాం. సర్రే క్రికెట్ క్లబ్‌ను కించపర్చాలన్నది మా ఉద్దేశం కాదు. జరిగింది చిన్న తప్పుగా భావించాలని ప్రజల్ని వేడుకుంటున్నాం’ అని కుక్‌సేన ఓ ప్రకటనను విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement