cricket club
-
సంచలన నిర్ణయం.. ఆ స్టేడియంలో సిక్స్ కొడితే ఔట్! ఎక్కడంటే?
ప్రస్తుతంక్రికెట్లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆటగాళ్లు బౌండరీలు బాదడానికి పోటీ పడుతున్నారు. ఆటగాళ్లు సిక్స్‌లు, ఫోర్లు కొడితేనే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందుతోంది. కానీ ఓ చోట మాత్రం ఇకపై సిక్స్‌లు కొట్టడం నిషేధం. అవును మీరు విన్నది నిజమే. రూల్స్‌ను అతిక్రమించి సిక్స్ కొడితే ఔటై పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. ఈ రూల్స్ వింటుంటే గల్లీ క్రికెట్ గుర్తుస్తోంది కదా? అస్సలు విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఇంగ్లండ్‌లోని సౌత్విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టేడియంలో ఆటగాళ్లు ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని ఈ క్లబ్ నిషేధించింది. క్రికెటర్లు కొట్టే సిక్స్‌ల వల్ల తమకు ఆస్తి నష్టం, భద్రతా సమస్యలు తలెత్తున్నాయని స్టేడియం సమీపంలోని నివాసితులు క్లబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.సౌత్విక్ అండ్ షోర్‌హామ్ స్టేడియం వద్ద వలలను ఏర్పాటు చేసినప్పటికీ కారుల అద్దాలు దెబ్బ తినడంతో పాటు చాలా మందికి గాయాలు కూడా తరుచుగా అవుతన్నాయి. ఈ క్రమంలోనే సౌత్విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఈ విచిత్ర నిర్ణయాన్ని తీసుకున్నాయి.కాగా సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించడంతో పాటు మరో కొత్త రూల్‌ను కూడా అమలు లోకి తీసుకు వచ్చింది. ఇకపై ఏ ఆటగాడైనా సిక్స్ కొడితే మొదటి తప్పుగా పరిగణించి పరుగులను లెక్కలోకి తీసుకోరు. అనంతరం రెండో సారి సిక్స్ కొడితే అంపైర్లు ఔట్‌గా ప్రకటిస్తారు.ఇదే విషయంపై క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోక్సప్ మాట్లాడుతూ.. "గతంలో క్రికెట్ అంటే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ట్వంటీ-ట్వంటీ క్రికెట్ పుట్టుకరావడంతో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. దాంతో మా స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల వల్ల సమీపంలోని నివాసితులకు ఇబ్బందులు తలెత్తున్నాయి. అందుకే ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించామని" పేర్కొన్నారు. -
చరిత్రలో నిలిచిపోయే క్యాచ్.. దిగ్గజాలను సైతం అబ్బురపరిచేలా
క్రికెట్లో స్టన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో చూశాం. అయితే ఇటీవలి కాలంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టుకోవడంలో ఫీల్డర్లు ప్రదర్శిస్తున్న నేర్పు హైలైట్ అవుతున్నాయి. బంతి బౌండరీలైన్ వద్ద ఉండగానే గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకొని మళ్లీ బౌండరీ లోపలికి విసిరి అందుకోవడం చూస్తున్నాం. ఇలాంటి క్యాచ్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. జిల్లా క్రికెట్ క్లబ్లో భాగంగా ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బౌలర్ ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని బ్యాటర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే ఒక ఊహించని అద్బుతం జరిగింది. ఆ ఏముందిలే.. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ తీసుకొని ఉంటాడులే అనుకుంటే పొరబడ్డట్లే. బౌండరీ అవతలకి వెళ్లి బంతిని అందుకున్న ఫీల్డర్.. ఇక్కడే తన ఫుట్‌బాల్ విన్యాసం చూపించాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పట్టుతప్పి బౌండరీ లైన్ మీదకు జారిపడతానని భావించిన ఫీల్డర్.. బంతిని గాల్లోకి విసిరేసి ఫుట్‌బాల్‌లోని ఫేమస్ బ్యాక్‌వ్యాలీ కిక్‌ను కొట్టాడు. అంతే బంతి మరో ఫీల్డర్ దగ్గరకు వెళ్లడం.. అతను సేఫ్‌గా అందుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సదరు ఫీల్డర్ చేసిన విన్యాసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ''ఫుట్‌బాల్ తెలిసిన ఆటగాడిని క్రికెట్లోకి తీసుకొస్తే ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్.. ''నిజంగా ఇది గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్'' అంటూ అభివర్ణించాడు. ఇక కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్.. ''నిజంగా ఇది ఔట్‌స్టాండింగ్..'' అంటూ పొగడ్తలు కురిపించాడు. It doesn't matter what the rules say. You've got to give this out for the pure AUDACITY 🤯😂 Sent in by Kiran Tarlekar pic.twitter.com/pquwsLc5YC — Cricket District (@cricketdistrict) February 12, 2023 This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg — Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023 Surely the greatest catch of all time … 🙌🙌 pic.twitter.com/ZJFp1rbZ3B — Michael Vaughan (@MichaelVaughan) February 12, 2023 Absolutely outstanding 👌👌😂 https://t.co/Im77ogdGQB — Jimmy Neesham (@JimmyNeesh) February 12, 2023 చదవండి: Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్ ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని -
గంగూలీకి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
లండన్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అరుదైన గౌరవం పొందాడు. ప్రతిష్టాత్మకమైన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అతడికి జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని ప్రదానం చేసింది. ‘లార్డ్స్ మైదానంలో నాకు కొన్ని చిరస్మరణీయ జ్ఞాపకాలున్నాయి. 2002లో అరంగేట్రం టెస్టులోనే ఇక్కడ సెంచరీ సాధించాను. ఓ ఆటగాడిగా.. రిటైరయ్యాక లార్డ్స్‌కు రావడం ఆనందంగా ఉంది. ఎంసీసీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు క్లబ్‌కు కృతజ్ఞతలు’ అని గంగూలీ అన్నాడు. -
సీసీఎల్-5
-
రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం
వెంకటగిరి రాజా కుటుంబీకుడు వెలుగోటి వెంకటసత్యప్రసాదకృష్ణ యాచేంద్రకు అరుదైన అవకాశం లభించింది. బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా బీసీసీఐ నియమించింది. సత్యప్రసాద్ యాచేంద్రగా ప్రాచుర్యం పొందిన ఆయన రంజీ క్రికెట్లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌గా రాణించి మంచి క్రీడాకారుడిగా గుర్తింపుపొందారు. ప్రస్తుతం సౌత్‌జోన్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. 2008లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సత్యప్రసాద్ యాచేంద్ర ఇంటర్మీడియట్ విద్యను పుట్టపర్తిలోని బృందావనంలో పూర్తి చేశారు. చెన్నైలో ఎంకాం చదివే సమయంలో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని అటుగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే స్థాయికి చేరుకున్నారు. తమ రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం లభించడంపై వెంకటగిరి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్‌లైన్, వెంకటగిరి : క్రికెట్‌తో పాటు పోలో తదితర క్రీడల్లో వెంకటగిరి సంస్థానం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ప్రధానంగా క్రికెట్లో వెంకటగిరి పేరు గతంలోనే మార్మోగింది. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా దివంగత వెంకటగిరి రాజా వీవీవీఆర్కే యాచేంద్ర వ్యవహరించారు. ఇక రాజకుటుంబంలో నేటి తరానికి చెందిన సత్యప్రసాద్ యాచేంద్రతోపాటు 50వ దశకంలో వెలుగోటి గోపాలకృష్ణ యాచేంద్ర రంజీ క్రీడాకారులుగా రాణించారు. వెంకటగిరి సంస్థాన క్రికెట్‌క్లబ్, వెంకటగిరి క్రికెట్ క్లబ్ అనే రెండు క్లబ్‌లను అప్పట్లోనే రాజాలు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ల ద్వారా పలువురు క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తున్నారు. పట్టణంలో తారక రామా క్రీడాప్రాంగణం రూపొందించారు. కాగా వెంకటగిరి క్రికెట్ క్లబ్‌కు ప్రస్తుత అధ్యక్షుడిగా సత్యప్రసాద్ యాచేంద్ర కొనసాగుతుండడం విశేషం. హర్షణీయం: అనంతరామయ్య, కోచ్ - సూరి స్టేడియం పర్యవేక్షకుడు వెంకటగిరి సంస్థానం కుచెందిన సత్యప్రసాద్ యాచేంద్ర భారతజట్టు మేనేజర్‌గా నియమితులవడం ఆనందంగా ఉంది. రాజాల కృషితో వెంకటగిరికి చెందిన నేటితరం విద్యార్థులు క్రికెట్ క్రీడలో రాణిస్తున్నారు. రాజాలు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఎన్నికలు నిర్వహించండి!
హెచ్‌సీఏకు కోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నియమావళి ప్రకారం నిర్ణీత వ్యవధిలోగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)తో పాటు ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌సీఏను కోర్టు ఆదేశించింది. హెచ్‌సీఏ నిబంధనల ప్రకారం మే నెల ఆఖరి ఆదివారం కచ్చితంగా ఎన్నికలు జరపాలని, అయితే హెచ్‌సీఏ ఈ దిశగా ఎలాంటి చర్య తీసుకోవడం లేదని గ్రీన్ టర్ఫ్ క్రికెట్ క్లబ్, మొదటి అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టు (రంగారెడ్డి జిల్లా)లో ఈ నెల 3న కేసు దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి డి. నాగార్జున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. హెచ్‌సీఏ నియమావళి ప్రకారమే ఎన్నికలు జరపాలన్న కోర్టు, దీనిపై స్పందించమంటూ సంఘానికి నోటీసు జారీ చేసింది. -
క్రికెట్లో కోచింగ్ పాత్ర పెరిగింది
మాదాపూర్, న్యూస్‌లైన్: ప్రస్తుతం క్రికెట్లో అవకాశాలతో పాటు పోటీ కూడా పెరిగిందని, ఈ స్థితిలో చక్కటి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే నిలబడగలరని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డారు. అందుకోసం వ్యక్తిగత కోచింగ్ కీలకంగా మారిందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడి ట్రియంప్ అకాడమీలో రాజూస్ క్రికెట్ క్లబ్లో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గతంలో క్రికెట్లో శిక్షణకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా స్పష్టత ఉండకపోయేది. కోచ్‌లు కూడా ఆటకంటే క్రమశిక్షణవంటి విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. అయితే ఇప్పుడు క్రికెట్లో పోటీతో పరిస్థితి మారింది’ అని కిర్మాణీ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆయన చెప్పారు. ‘ఎప్పటికప్పుడు క్రికెటర్లు తమ ఆటకు పదును పెట్టాలి. ఎంత బాగా ఆడుతున్నా మరింతగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. పైగా ఒక టోర్నీలో పరుగులు సాధించడం గొప్ప విషయం కాదు. నిలకడగా ఆడితేనే కుర్రాళ్లకు భవిష్యత్తు ఉంటుంది’ అని ఈ దిగ్గజ కీపర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, అంకితభావంతోనే ఇది సాధ్యమని ఆయన అన్నారు. ఇటీవల భారత జట్టు ఎంపిక విషయంలో జాతీయ సెలక్షన్ కమిటీపై తరచూ వివాదాలు వస్తున్నాయని, ప్రతిభ గల ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఇలాంటి ప్రశ్నలు ఎదురు కావని కిర్మాణీ విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో జెమ్ మోటార్స్ చైర్మన్ రాజు యాదవ్, క్రికెట్ క్లబ్ నిర్వాహకులు రాజు, ట్రియంప్ స్పోర్ట్స్ సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంసీసీ కెప్టెన్‌గా సెహ్వాగ్
డర్హమ్‌తో చాంపియన్ కౌంటీ మ్యాచ్ లండన్: భారత సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అబుదాబిలో మార్చి 23 నుంచి జరగనున్న నాలుగు రోజుల చాంపియన్ కౌంటీ మ్యాచ్‌లో ఎంసీసీకి సెహ్వాగ్ సారథ్యం వహించనున్నాడు. డర్హమ్ జట్టుతో జరిగే ఈ మ్యాచ్‌కు ఎంసీసీ జట్టులో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ కూడా ఆడతాడు. కాగా, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో జరగనున్న ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తి కలిగిస్తోందని, ఇటువంటి ప్రయోగాత్మక మ్యాచ్‌లో ఎంసీసీకి కెప్టెన్సీ వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని సెహ్వాగ్ అన్నాడు. -
సెయింట్ ప్యాట్రిక్స్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా అక్షిత్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ జట్టు 195 పరుగుల అధిక్యంతో ఘన విజయం సాధించింది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అక్షిత్ జట్టు అభిలాష్ (5/15) ధాటికి 122 పరుగులకే కుప్పకూలింది. శాంతి ఎలెవన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో స్టార్లెట్స్ జట్టు 29 పరుగుల తేడాతో ఓడింది. సురేష్ (5/37) రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు శాంతి ఎలెవన్: 133 (వినీత్ 32; సురేష్ 5/37); స్టార్లెట్స్: 104 (అజయ్ కుమార్ 31; దుర్గా ప్రసాద్ 6/39). సెయింట్ ప్యాట్రిక్స్: 317/8 (సాత్యకి 85, రుషికేష్ 80, కృష్ణ 40, సన్నిద్ 50; చంద్ర 3/70); అక్షిత్ సీసీ: 122 (రిత్విక్ 41; అభిలాష్ 5/15). క్లాసిక్: 248 (రషీద్ 34, లయీఖ్ 31, అలీ ఖాన్ 50, సయ్యద్ ఇమ్రాన్ 43; సాగర్ 5/45); గగన్ మహల్: 212 (అతుల్ జాలి 103; ర ఫీ 5/65, లయీఖ్ 5/45 ). ఏవీసీసీ: 293 (ప్రతీక్ రెడ్డి 50, గౌరవ్ రెడ్డి 86 , రే వంత్ 50, యష్ కపాడియా 50, నరేష్ సాగర్ 3/88); విజయానంద్: 141 (కరీం 50, సుమీత్ 3/3). వీపీ విల్లోమెన్: 68 (మహర్ 3/13, గంగాధర్ 3/1); విక్టర్: 59 (షాకిర్ అహ్మద్ 7/18). సెయింట్ మేరీస్: 181 (రోహిత్ 62, కుందన్ 30; రణధీర్ 4/74, వినయ్ 5/23); నవజీవన్ ఫ్రెండ్స్: 125 (వశిష్ట 3/25, నరేష్ 3/39). విక్టరీ: 240/6 ( సోహైల్ ఖాన్ 94); వాకర్ టౌన్: 242/4 (రాము 75, నర్సింగ్ రావు 99). టీమ్ కున్: 249/3 (మహ్మద్ తాహా షేక్ 122 నాటౌట్, చరణ్ 55); హైదరాబాద్ పేట్రియాట్స్: 233 (మహ్మద్ అలీ 118; మహ్మద్ తాహా షేక్ 5/58). పీఎన్సీసీ: 56 (అభిషేక్ 4/12, పవన్ 5/21); విజయ్ సీసీ: 57/1. గన్‌రాక్: 69 (సూర్య 6/33); చమ్స్ ఎలెవన్: 70/2 (కార్తీక్ 36). మాంచెస్టర్: 240/9 (శేషగిరి 74, మధు 53 నాటౌట్; అనిల్ కుమార్ 4/67); తారకరామ: 149 (అనిల్ కుమార్ 42; వంశీ 3/30, రఘు 3/30). డెక్కన్ కోల్ట్స్: 103 (చందు 4/30); ధృవ్ ఎలెవన్ 104/8 (అజీం 56; సంతోష్ 4/41). విజయ భారతి: 134 (రాజు 34; శ్రవణ్ నాయుడు 5/20); హెచ్‌జీసీ : 135/3 (రణధీర్ 61, సీబీ 3/15). యంగ్ సిటిజన్: 202 (సాగర్ 39, ఆకాన్ష్ 45); హెచ్‌పీఎస్ ఆర్: 206/3 (సింహ 79 నాటౌట్, అభిరథ్ రెడ్డి93; రతన్ తేజ 3/22). యునెటైడ్: 93 (నారాయణ 34; శ్రీకాంత్ 6/10, జితేందర్ గౌడ్ 3/19); అంబర్పేట్: 99/2 (సందీప్ 54). హెచ్‌యూసీసీ: 149 (సయ్యద్ మవీనుద్దీన్ 34, అస్లామ్ అక్బర్ హుస్సేన్ 47, సయ్యద్ హషమ్ 3/55, అబ్దుల్ అజీమ్ 4/27), అపెక్స్ సీసీ: 150 (అన్వర్ అలీ 46, సయ్యద్ జావీద్ 38 నాటౌట్, సయ్యద్ పాషా అలీ 33 నాటౌట్). -
‘క్షమించండి’
లండన్: ఓవల్ పిచ్‌పై తమ క్రికెటర్లు మూత్ర విసర్జన చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఇంగ్లండ్ జట్టు క్షమాపణలు చెప్పింది. క్రికెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను తాము చాలా గౌరవిస్తామని తెలిపింది. ‘మాపై ఆడిన ప్రత్యర్థులన్నా, మేం ఆడిన మైదానాలన్నా మాకు చాలా గౌరవం. గొప్ప సిరీస్ గెలిచిన ఆనందంలోనూ మేం ఈ విషయాలను మర్చిపోకూడదు. అయితే కొంత మంది ప్రవర్తించిన తీరుమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా సంబరాల్లో జరిగిన తప్పిదానికి మేం క్షమాపణలు కోరుతున్నాం. సర్రే క్రికెట్ క్లబ్‌ను కించపర్చాలన్నది మా ఉద్దేశం కాదు. జరిగింది చిన్న తప్పుగా భావించాలని ప్రజల్ని వేడుకుంటున్నాం’ అని కుక్‌సేన ఓ ప్రకటనను విడుదల చేసింది.