ప్రస్తుతంక్రికెట్‌లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆటగాళ్లు బౌండరీలు బాదడానికి పోటీ పడుతున్నారు. ఆటగాళ్లు సిక్స్‌లు, ఫోర్లు కొడితేనే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందుతోంది. కానీ ఓ చోట మాత్రం ఇకపై సిక్స్‌లు కొట్టడం నిషేధం.
అవును మీరు విన్నది నిజమే. రూల్స్‌ను అతిక్రమించి సిక్స్ కొడితే ఔటై పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. ఈ రూల్స్ వింటుంటే గల్లీ క్రికెట్ గుర్తుస్తోంది కదా? అస్సలు విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఇంగ్లండ్‌లోని సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టేడియంలో ఆటగాళ్లు ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని ఈ క్లబ్ నిషేధించింది. క్రికెటర్లు కొట్టే సిక్స్‌ల వల్ల తమకు ఆస్తి నష్టం, భద్రతా సమస్యలు తలెత్తున్నాయని స్టేడియం సమీపంలోని నివాసితులు క్లబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.
సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ స్టేడియం వద్ద వలలను ఏర్పాటు చేసినప్పటికీ కారుల అద్దాలు దెబ్బ తినడంతో పాటు చాలా మందికి గాయాలు కూడా తరుచుగా అవుతన్నాయి. ఈ క్రమంలోనే సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఈ విచిత్ర నిర్ణయాన్ని తీసుకున్నాయి.
కాగా సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించడంతో పాటు మరో కొత్త రూల్‌ను కూడా అమలు లోకి తీసుకు వచ్చింది. ఇకపై ఏ ఆటగాడైనా సిక్స్ కొడితే మొదటి తప్పుగా పరిగణించి పరుగులను లెక్కలోకి తీసుకోరు. అనంతరం రెండో సారి సిక్స్ కొడితే అంపైర్‌లు ఔట్‌గా ప్రకటిస్తారు.
ఇదే విషయంపై క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోక్సప్ మాట్లాడుతూ.. "గతంలో క్రికెట్ అంటే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ట్వంటీ-ట్వంటీ క్రికెట్ పుట్టుకరావడంతో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. దాంతో మా స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల వల్ల సమీపంలోని నివాసితులకు ఇబ్బందులు తలెత్తున్నాయి. అందుకే ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించామని" పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment