ఎంసీసీ కెప్టెన్‌గా సెహ్వాగ్ | Virender Sehwag to lead MCC squad in four-day Champion County fixture | Sakshi
Sakshi News home page

ఎంసీసీ కెప్టెన్‌గా సెహ్వాగ్

Published Fri, Feb 21 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

ఎంసీసీ కెప్టెన్‌గా సెహ్వాగ్

ఎంసీసీ కెప్టెన్‌గా సెహ్వాగ్

డర్హమ్‌తో చాంపియన్ కౌంటీ మ్యాచ్
 లండన్: భారత సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అబుదాబిలో మార్చి 23 నుంచి జరగనున్న నాలుగు రోజుల చాంపియన్ కౌంటీ మ్యాచ్‌లో ఎంసీసీకి సెహ్వాగ్ సారథ్యం వహించనున్నాడు.

డర్హమ్ జట్టుతో జరిగే ఈ మ్యాచ్‌కు ఎంసీసీ జట్టులో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ కూడా ఆడతాడు. కాగా, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో జరగనున్న ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తి కలిగిస్తోందని, ఇటువంటి ప్రయోగాత్మక మ్యాచ్‌లో ఎంసీసీకి కెప్టెన్సీ వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని సెహ్వాగ్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement