
గంగూలీకి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
లండన్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అరుదైన గౌరవం పొందాడు. ప్రతిష్టాత్మకమైన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అతడికి జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని ప్రదానం చేసింది. ‘లార్డ్స్ మైదానంలో నాకు కొన్ని చిరస్మరణీయ జ్ఞాపకాలున్నాయి.
2002లో అరంగేట్రం టెస్టులోనే ఇక్కడ సెంచరీ సాధించాను. ఓ ఆటగాడిగా.. రిటైరయ్యాక లార్డ్స్‌కు రావడం ఆనందంగా ఉంది. ఎంసీసీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు క్లబ్‌కు కృతజ్ఞతలు’ అని గంగూలీ అన్నాడు.