క్రికెట్‌లో స్టన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో చూశాం. అయితే ఇటీవలి కాలంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టుకోవడంలో ఫీల్డర్లు ప్రదర్శిస్తున్న నేర్పు హైలైట్ అవుతున్నాయి. బంతి బౌండరీలైన్ వద్ద ఉండగానే గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకొని మళ్లీ బౌండరీ లోపలికి విసిరి అందుకోవడం చూస్తున్నాం. ఇలాంటి క్యాచ్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు.
విషయంలోకి వెళితే.. జిల్లా క్రికెట్ క్లబ్‌లో భాగంగా ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బౌలర్ ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని బ్యాటర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే ఒక ఊహించని అద్బుతం జరిగింది. ఆ ఏముందిలే.. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ తీసుకొని ఉంటాడులే అనుకుంటే పొరబడ్డట్లే.
బౌండరీ అవతలకి వెళ్లి బంతిని అందుకున్న ఫీల్డర్.. ఇక్కడే తన ఫుట్‌బాల్ విన్యాసం చూపించాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పట్టుతప్పి బౌండరీ లైన్ మీదకు జారిపడతానని భావించిన ఫీల్డర్.. బంతిని గాల్లోకి విసిరేసి ఫుట్‌బాల్‌లోని ఫేమస్ బ్యాక్‌వ్యాలీ కిక్‌ను కొట్టాడు. అంతే బంతి మరో ఫీల్డర్ దగ్గరకు వెళ్లడం.. అతను సేఫ్‌గా అందుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సదరు ఫీల్డర్ చేసిన విన్యాసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ''ఫుట్‌బాల్ తెలిసిన ఆటగాడిని క్రికెట్‌లోకి తీసుకొస్తే ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్.. ''నిజంగా ఇది గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్'' అంటూ అభివర్ణించాడు. ఇక కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్.. ''నిజంగా ఇది ఔట్‌స్టాండింగ్..'' అంటూ పొగడ్తలు కురిపించాడు.
It doesn't matter what the rules say.
— Cricket District (@cricketdistrict) February 12, 2023
You've got to give this out for the pure AUDACITY 🤯😂
Sent in by Kiran Tarlekar pic.twitter.com/pquwsLc5YC
This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg
— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023
Surely the greatest catch of all time … 🙌🙌 pic.twitter.com/ZJFp1rbZ3B
— Michael Vaughan (@MichaelVaughan) February 12, 2023
Absolutely outstanding 👌👌😂 https://t.co/Im77ogdGQB
— Jimmy Neesham (@JimmyNeesh) February 12, 2023
చదవండి: Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్
Comments
Please login to add a commentAdd a comment