హెచ్‌సీఏకు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నియమావళి ప్రకారం నిర్ణీత వ్యవధిలోగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)తో పాటు ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌సీఏను కోర్టు ఆదేశించింది. హెచ్‌సీఏ నిబంధనల ప్రకారం మే నెల ఆఖరి ఆదివారం కచ్చితంగా ఎన్నికలు జరపాలని, అయితే హెచ్‌సీఏ ఈ దిశగా ఎలాంటి చర్య తీసుకోవడం లేదని గ్రీన్ టర్ఫ్ క్రికెట్ క్లబ్, మొదటి అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టు (రంగారెడ్డి జిల్లా)లో ఈ నెల 3న కేసు దాఖలు చేసింది.
దీనిపై న్యాయమూర్తి డి. నాగార్జున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. హెచ్‌సీఏ నియమావళి ప్రకారమే ఎన్నికలు జరపాలన్న కోర్టు, దీనిపై స్పందించమంటూ సంఘానికి నోటీసు జారీ చేసింది.
ఎన్నికలు నిర్వహించండి!
Published Wed, May 7 2014 11:47 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement