
ఆసీస్‌దే వన్డే సిరీస్
సౌతాంప్టన్: ‘యాషెస్’ టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకొని ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించింది. మైకేల్ క్లార్క్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 49 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
ఈ సిరీస్‌లోని రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దయ్యాయి. తొలుత షేన్ వాట్సన్ (107 బంతుల్లో 143; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, జోర్డాన్ 3, రాన్‌కిన్, రూట్ చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటై ఓడింది. బొపారా (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే చివరి వరుస బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఫాల్క్‌నర్ 3, జాన్సన్ 2 వికెట్లు పడగొట్టారు. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; క్లార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.