ఆసీస్‌దే సిరీస్ | Australia stroll to series win | Sakshi
Sakshi News home page

ఆసీస్‌దే సిరీస్

Published Mon, Jan 20 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

Australia stroll to series win

 సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే యాషెస్ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన కుక్ బృందం వన్డే సిరీస్‌లోనూ చేతులెత్తేసింది. డేవిడ్ వార్నర్ (70 బంతుల్లో 71; 7 ఫోర్లు; 2 సిక్స్), షాన్ మార్ష్ (89 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది.
 
 తద్వారా ఐదు వన్డేల సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు చేసింది. మోర్గాన్ (58 బంతుల్లో 54; 4 ఫోర్లు; 2 సిక్స్) రాణించాడు. కౌల్టర్ నైల్‌కు మూడు వికెట్లు, ఫాల్క్‌నర్, క్రిస్టియాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్ 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement