
ఓవల్: టీమిండియాతో నాలుగో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాల(తన భార్య రెండో బిడ్డను జన్మనివ్వనున్నందున) చేత ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకోనుండగా, ఫాస్ట్ బౌలర్ సకీబ్ మహమూద్‌పై వేటు పడింది. బట్లర్ స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేయనుండగా, సకీబ్ ప్లేస్‌లో క్రిస్ వోక్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇంగ్లండ్ జట్టులో మార్పులపై కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ.. నాలుగో టెస్ట్‌లో వికెట్‌కీపింగ్ బాధ్యతలను జానీ బెయిర్‌స్టో నిర్వహిస్తాడని, దీని వల్ల అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. కీపింగ్ బాధ్యతలకు బెయిర్‌స్టో ఓకే చెబితే.. ఓలీ పోప్ లేదా డానియల్ లారెన్స్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది.
నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:
జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్ (కీపర్), రోరీ బర్న్స్, సామ్ కర్రన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
చదవండి: IPL 2021: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment