లండన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఓపెనర్ కుక్ (124 బంతుల్లో 81; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా రూట్ (73 బంతుల్లో 48; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. దీంతో రెండో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. క్రీజులో వోక్స్ (31 బ్యాటింగ్) బ్రాడ్ (11 బ్యాటింగ్) ఉన్నారు. యాసిర్ షా ఐదు వికెట్లతో చెలరేగగా ఆమిర్, రాహత్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకు ముందు పాకిస్తాన్ 339 పరుగులకు ఆలౌటయింది. మిస్బా (114) సెంచరీ చేశాడు.