మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మిస్బా | Pakistan confident after pushing Australia close, says Misbah | Sakshi
Sakshi News home page

మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మిస్బా

Published Sun, Dec 25 2016 2:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మిస్బా

మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మిస్బా

మెల్బోర్న్:ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో తుది వరకూ పోరాడటం తమ జట్టు సభ్యల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ స్పష్టం చేశాడు. రెండో టెస్టులో కూడా అదే తరహా ఆటను ప్రదర్శించి ఆసీస్ను మరొకసారి ఒత్తిడిలోకి నెట్టడానికి యత్నిస్తామన్నాడు. ప్రస్తుతం తమ ఆటగాళ్లు నెట్స్ లో విరామం లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారన్నాడు. దానికి కారణం తొలి టెస్టు నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసమేనన్నాడు.

 

'రెండో  టెస్టులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా నిలకడ ఆటడానికి యత్నిస్తాం. ఈసారి ఎటువంటి అవకాశాన్ని వదలం. సమిష్టగా రాణిస్తే ఆసీస్ను మట్టికరిపించడం కష్టం కాదు. వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు, సమష్ట కృషి కూడా అవసరం. దానిపై దృష్టి సారించాం'అని మిస్బా తెలిపాడు. బ్రిస్బేన్ లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విసిరిన 490 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ పోరాట ప్రదర్శన కనబరిచింది.లక్ష్య ఛేదనలో 450 పరుగులు సాధించి 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోమవారం నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రెండో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement