మిస్బానే కెప్టెన్..
సిడ్నీ: రేపట్నుంచి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగనున్న చివరిదైన మూడో టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హకే సారథిగా వ్యవరించనున్నాడు. ఇప్పటివరకూ సిడ్నీ టెస్టుకు మిస్బా కెప్టెన్గా వ్యవహరిస్తాడా?లేదా?అనే దానిపై నెలకొన్న సందిగ్థతకు పీసీబీ తెరదించింది.. చివరి టెస్టుకు మిస్బా కెప్టెన్గా చేస్తాడంటూ పీసీబీ స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్ వరకూ పాకిస్తాన్ కు మరో టెస్టు సిరీస్ లేకపోవడంతో మిస్బానే సారథిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది.
ఇటీవల రెండో టెస్టులో ఘోర ఓటమి తరువాత మిస్బా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.'నేను ఎప్పుడూ రిటైర్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జట్టులో కొనసాగుతున్నా. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసింది అనుకుంటున్నా. నా రిటైర్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జట్టు అవసరాల కోసం ఆడకపోతే ఇక నేను అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఆ క్రమంలోనే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. సిడ్నీ టెస్టుకు ముందుగానీ, ఆ తరువాత గానీ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటా'అని మిస్బా పేర్కొన్నాడు.