Misbah
-
మిస్బానే కెప్టెన్..
సిడ్నీ: రేపట్నుంచి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగనున్న చివరిదైన మూడో టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హకే సారథిగా వ్యవరించనున్నాడు. ఇప్పటివరకూ సిడ్నీ టెస్టుకు మిస్బా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా?లేదా?అనే దానిపై నెలకొన్న సందిగ్థతకు పీసీబీ తెరదించింది.. చివరి టెస్టుకు మిస్బా కెప్టెన్‌గా చేస్తాడంటూ పీసీబీ స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్ వరకూ పాకిస్తాన్ కు మరో టెస్టు సిరీస్ లేకపోవడంతో మిస్బానే సారథిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇటీవల రెండో టెస్టులో ఘోర ఓటమి తరువాత మిస్బా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.'నేను ఎప్పుడూ రిటైర్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జట్టులో కొనసాగుతున్నా. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసింది అనుకుంటున్నా. నా రిటైర్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జట్టు అవసరాల కోసం ఆడకపోతే ఇక నేను అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఆ క్రమంలోనే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. సిడ్నీ టెస్టుకు ముందుగానీ, ఆ తరువాత గానీ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటా'అని మిస్బా పేర్కొన్నాడు. -
మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మిస్బా
మెల్బోర్న్:ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో తుది వరకూ పోరాడటం తమ జట్టు సభ్యల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ స్పష్టం చేశాడు. రెండో టెస్టులో కూడా అదే తరహా ఆటను ప్రదర్శించి ఆసీస్‌ను మరొకసారి ఒత్తిడిలోకి నెట్టడానికి యత్నిస్తామన్నాడు. ప్రస్తుతం తమ ఆటగాళ్లు నెట్స్ లో విరామం లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారన్నాడు. దానికి కారణం తొలి టెస్టు నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసమేనన్నాడు. 'రెండో టెస్టులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా నిలకడ ఆటడానికి యత్నిస్తాం. ఈసారి ఎటువంటి అవకాశాన్ని వదలం. సమిష్టగా రాణిస్తే ఆసీస్‌ను మట్టికరిపించడం కష్టం కాదు. వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు, సమష్ట కృషి కూడా అవసరం. దానిపై దృష్టి సారించాం'అని మిస్బా తెలిపాడు. బ్రిస్బేన్ లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విసిరిన 490 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ పోరాట ప్రదర్శన కనబరిచింది.లక్ష్య ఛేదనలో 450 పరుగులు సాధించి 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోమవారం నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రెండో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. -
ఇంగ్లండ్ 253/7
లండన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఓపెనర్ కుక్ (124 బంతుల్లో 81; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా రూట్ (73 బంతుల్లో 48; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. దీంతో రెండో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. క్రీజులో వోక్స్ (31 బ్యాటింగ్) బ్రాడ్ (11 బ్యాటింగ్) ఉన్నారు. యాసిర్ షా ఐదు వికెట్లతో చెలరేగగా ఆమిర్, రాహత్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకు ముందు పాకిస్తాన్ 339 పరుగులకు ఆలౌటయింది. మిస్బా (114) సెంచరీ చేశాడు. -
కెప్టెన్సీపై వెనక్కి తగ్గిన అఫ్రిది
కరాచీ : కెప్టెన్సీపై అల్ రౌండర్ షాహిద్ అఫ్రిది వెనక్కి తగ్గాడు. మిస్బావుల్‌కే తన మద్దతు ఉంటుందని అఫ్రిది బుధవారం వెల్లడించాడు. ఈ మేరకు అతడు ఓ ప్రకటన చేశాడు. మిస్సావుల్ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, తన సహకారం పూర్తిగా ఉంటుందని అఫ్రిది తెలిపాడు. అలాగే 2015లో జరిగే ప్రపంచ కప్ కెప్టెన్‌గా మిస్సావుల్ బెస్ట్ ఛాయస్గా అతడు పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌ను మార్చాలనుకుంటే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ అఫ్రిది నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగేంత వరకు మిస్బా ఉల్ హక్నే కెప్టెన్‌గా కొనసాగించాలన్న నిర్ణయానికి పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు వచ్చిన విషయం తెలిసిందే. జట్టు కెప్టెన్సీ రేసులో ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. బోర్డు సభ్యుల్లోని మెజార్టీ మిస్బా వైపే మొగ్గు చూపింది. దీంతో కెప్టెన్సీ రేసులో తాను లేనంటూ అఫ్రిది ఎట్టేకేలకు వివాదానికి తెర దించాడు.