కెప్టెన్సీపై వెనక్కి తగ్గిన అఫ్రిది
కరాచీ : కెప్టెన్సీపై అల్ రౌండర్ షాహిద్ అఫ్రిది వెనక్కి తగ్గాడు. మిస్బావుల్కే తన మద్దతు ఉంటుందని అఫ్రిది బుధవారం వెల్లడించాడు. ఈ మేరకు అతడు ఓ ప్రకటన చేశాడు. మిస్సావుల్ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, తన సహకారం పూర్తిగా ఉంటుందని అఫ్రిది తెలిపాడు. అలాగే 2015లో జరిగే ప్రపంచ కప్ కెప్టెన్గా మిస్సావుల్ బెస్ట్ ఛాయస్గా అతడు పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ను మార్చాలనుకుంటే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ అఫ్రిది నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కాగా వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగేంత వరకు మిస్బా ఉల్ హక్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలన్న నిర్ణయానికి పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు వచ్చిన విషయం తెలిసిందే. జట్టు కెప్టెన్సీ రేసులో ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. బోర్డు సభ్యుల్లోని మెజార్టీ మిస్బా వైపే మొగ్గు చూపింది. దీంతో కెప్టెన్సీ రేసులో తాను లేనంటూ అఫ్రిది ఎట్టేకేలకు వివాదానికి తెర దించాడు.