కామెంట్లపై నోరు విప్పిన ఆఫ్రిది
టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మరోసారి ఓటమిపై పాకిస్తాన్‌లో నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఆఫ్రిది నోరు విప్పారు. 'ప్రయత్న లోపం లేకుండా 100 శాతం గ్రౌండ్లో కష్టపడితే అదే నాకు సంతృప్తినిస్తుంది. ఆ తర్వాత గెలిచామా, ఓడామా అనేది పెద్దగా పట్టించుకోను. మైదానంలో తప్పిదాలను తగ్గించడంపై దృష్టి పెట్టాం. బౌలర్లు, బ్యాట్స్మెన్లు మంచి ఫాంలో ఉన్నారు. పొరపాట్లను తగ్గించడంపై కసరత్తు చేస్తున్నాం' అని ఆఫ్రిది పేర్కొన్నాడు.
కెప్టెన్సీలో దారుణంగా విఫలమయ్యాడంటూ ఆఫ్రిదిపై పాక్ మాజీలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. భారత్‌తో మ్యాచ్‌లో ఆఫ్రిది ఏమాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎమాద్ వాసిమ్‌ను తీసుకోకుండా తప్పిదం చేశాడని విమర్శించారు. ఫామ్‌లో ఉన్న హఫీజ్‌ను పక్కనబెట్టి ఆఫ్రిది వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగడాన్ని వారు తప్పుపట్టిన విషయం తెలిసిందే. రేపు(మంగళవారం) పాకిస్తాన్, న్యూజిలాండ్తో తలపడనుంది.