రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపు | England win second ODI | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపు

Published Tue, Mar 4 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపు

రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపు

నార్త్ సౌండ్: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఇబ్బంది పడిన ఇంగ్లండ్ జట్టును రవి బొపారా (59 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు), కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ (46 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు.

ఫలితంగా సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేను ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో గెలుచుకుంది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 44.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును సిమ్మన్స్ (98 బంతుల్లో 70; 4 ఫోర్లు; 2 సిక్స్) ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు డారెన్ బ్రేవో (34 బంతుల్లో 13; 1 సిక్స్)తో కలిసి 51 పరుగులు జోడించాడు.

స్టీఫెన్ ప్యారీకి మూడు, రూట్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ మైకేల్ లంబ్ (60 బంతుల్లో 39; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బ్రాడ్, బొపారా ఆదుకుని విజయాన్ని అందించారు. ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించింది. డ్వేన్ బ్రేవోకు రెండు వికెట్లు దక్కాయి. మూడో వన్డే 5న జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement