ఆసీస్‌దే టి20 సిరీస్
ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా
సిడ్నీ: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. స్టేడియం ఆస్ట్రేలియాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఫించ్‌సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. డి కాక్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెండ్రిక్స్ (48 బంతుల్లో 49; 5 ఫోర్లు); మిల్లర్ (26 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు 3 వికెట్లు దక్కాయి.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసి నెగ్గింది. వైట్ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఫించ్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్‌వెల్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. డేవిడ్ వైస్, పీటర్సన్ చెరో మూడు వికెట్లు తీశారు. వైట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఫాల్క్‌నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.