సన్‌రైజర్స్, పంజాబ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ల తడబాటును గమనించే ఉంటారు. 11 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వార్నర్ వదిలేశాడు.
షార్జా: సన్‌రైజర్స్, పంజాబ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ల తడబాటును గమనించే ఉంటారు. 11 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వార్నర్ వదిలేశాడు. అదే ఓవర్లో పుజారా కొట్టిన బంతిని అందుకునేందుకు వచ్చిన స్యామీ అకస్మాత్తుగా వెనక్కు తిరిగాడు.
నిజానికి ఈ ఇద్దరూ మంచి ఫీల్డర్లు మరి ఎందుకు ఇలా? ఈ ప్రశ్నకు సమాధానం సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ చెప్పారు. ‘షార్జా స్టేడియం పక్కనే ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో లైట్లు ఇక్కడ ఫీల్డర్ల మీద పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంతిని చూడటం ఇబ్బంది అవుతోంది.
స్యామీ బంతిని వదిలేసి వెనక్కి తిరగడానికి కారణం కూడా అదే’ అని చెప్పారు. కానీ దీనికి చెన్నై జట్టు చాలా సింపుల్‌గా పరిష్కారం కనుక్కుంది. అదేంటంటే... మ్యాచ్ ముందు రోజు రాత్రి అదే మైదానానికి వెళ్లి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం. మిగిలిన జట్లు ఇది తెలుసుకునే సరికే ఆలస్యం అయిపోయింది. ఇక ఈ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి.