Sanjay Manjrekar Comments On Virat Kohli Captaincy: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వివాదాస్పద వ్యాఖ్యాత, భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని భారత ఆల్‌టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేమని, ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేని వ్యక్తిని అలా ఎలా పరిగణిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారితో పోలిస్తే కోహ్లి చేసిందేమీ లేదని, కేవలం మీడియా హైప్ మూలంగానే అతనికి అర్హతకు మించి క్రెడిట్ దక్కిందని కోహ్లిపై అక్కసును వెల్లగక్కాడు. అయితే, ఆటగాడిగా తన పాత్రకు న్యాయం చేశాడని కోహ్లి అభిమానులకు ఊరట కలిగించే కామెంట్స్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు దిగ్గజ కెప్టెన్లలో ధోని ముఖ్యుడని, అతని సారధ్యంలో టీమిండియా అంతర్జాతీయ వేదికలపై మరపురాని విజయాలు నమోదు చేసిందని, ఈ క్రమంలో భారత్ ఎన్నో ఐసీసీ ట్రోఫీలను సాధించిందని, కెప్టెన్ సక్సెస్‌కు ఐసీసీ టోర్నీల్లో గెలుపే కొలమానమని, ఈ విషయంలో ధోని దరిదాపుల్లో కూడా కోహ్లి ఉండడని తన స్టైల్‌లో లాజిక్‌ను వివరించాడు. స్వదేశంలో విజయాలు, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలను ఐసీసీ ఈవెంట్లలో గెలుపుతో పోల్చలేమని ఆయన అభిప్రాయపడ్డాడు.
దిగ్గజ కెప్టెన్ల విషయానికొస్తే.. తన దృష్టిలో టీ20, వన్డే ప్రపంచప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోని, 1983 ప్రపంచకప్‌ను అందించిన కపిల్ ముఖ్యులని పేర్కొన్న మంజ్రేకర్.. టీమిండియాకు దూకుడు నేర్పిన గంగూలీ, సునీల్ గవాస్కర్‌లను కూడా దిగ్గజ కెప్టెన్లతో పోల్చకుండా ఉండలేమని తెలిపాడు.
అయితే, కెప్టెన్సీ విషయంలో కోహ్లికి తనదైన స్టైల్ ఉందని, ఓటమిని అంత ఈజీగా అంగీకరించడని, ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో అది మరోసారి నిరూపితమైందని గుర్తు చేశాడు. కోహ్లి ఎంతటి పోరాటపటిమ కనబర్చినప్పటివకీ, దురదృష్టం అతన్ని వెంటాడిందని అన్నాడు. 7 ఏళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఐసీసీ టోర్నీల్లో కోహ్లి టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి సంపూర్ణంగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL: విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..!
Comments
Please login to add a commentAdd a comment