captaincy record
-
విరాట్ కోహ్లి దిగ్గజ కెప్టెన్ ఎలా అవుతాడు.. ?
Sanjay Manjrekar Comments On Virat Kohli Captaincy: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వివాదాస్పద వ్యాఖ్యాత, భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని భారత ఆల్‌టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేమని, ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేని వ్యక్తిని అలా ఎలా పరిగణిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారితో పోలిస్తే కోహ్లి చేసిందేమీ లేదని, కేవలం మీడియా హైప్ మూలంగానే అతనికి అర్హతకు మించి క్రెడిట్ దక్కిందని కోహ్లిపై అక్కసును వెల్లగక్కాడు. అయితే, ఆటగాడిగా తన పాత్రకు న్యాయం చేశాడని కోహ్లి అభిమానులకు ఊరట కలిగించే కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టు దిగ్గజ కెప్టెన్లలో ధోని ముఖ్యుడని, అతని సారధ్యంలో టీమిండియా అంతర్జాతీయ వేదికలపై మరపురాని విజయాలు నమోదు చేసిందని, ఈ క్రమంలో భారత్ ఎన్నో ఐసీసీ ట్రోఫీలను సాధించిందని, కెప్టెన్ సక్సెస్‌కు ఐసీసీ టోర్నీల్లో గెలుపే కొలమానమని, ఈ విషయంలో ధోని దరిదాపుల్లో కూడా కోహ్లి ఉండడని తన స్టైల్లో లాజిక్‌ను వివరించాడు. స్వదేశంలో విజయాలు, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలను ఐసీసీ ఈవెంట్లలో గెలుపుతో పోల్చలేమని ఆయన అభిప్రాయపడ్డాడు. దిగ్గజ కెప్టెన్ల విషయానికొస్తే.. తన దృష్టిలో టీ20, వన్డే ప్రపంచప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోని, 1983 ప్రపంచకప్‌ను అందించిన కపిల్ ముఖ్యులని పేర్కొన్న మంజ్రేకర్.. టీమిండియాకు దూకుడు నేర్పిన గంగూలీ, సునీల్ గవాస్కర్లను కూడా దిగ్గజ కెప్టెన్లతో పోల్చకుండా ఉండలేమని తెలిపాడు. అయితే, కెప్టెన్సీ విషయంలో కోహ్లికి తనదైన స్టైల్ ఉందని, ఓటమిని అంత ఈజీగా అంగీకరించడని, ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో అది మరోసారి నిరూపితమైందని గుర్తు చేశాడు. కోహ్లి ఎంతటి పోరాటపటిమ కనబర్చినప్పటివకీ, దురదృష్టం అతన్ని వెంటాడిందని అన్నాడు. 7 ఏళ్ల కెప్టెన్సీ కెరీర్లో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఐసీసీ టోర్నీల్లో కోహ్లి టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి సంపూర్ణంగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL: విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..! -
ధోని ఖాతాలోకి ‘అనుకోని’ ఘనత
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని అనుకోకుండా టీమిండియాకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో టీమిండియా తరుపున 200 వన్టేలకు నాయకత్వం వహించిన ఘనత మిస్టర్ కూల్‌కు దక్కింది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమెట్ ఖాతాలో మరో రికార్డు చేరిందని ఐసీసీ ట్వీట్ చేసింది. టీమిండియాకు నాయకత్వం వహించిన అతి పెద్ద వయస్కుడిగా (37ఏళ్ల 80రోజులు) మిస్టర్ కూల్ అనుకోని రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్( 36 ఏళ్ల 124 రోజులు) రికార్డును ధోని సవరించాడు. ఇక ఓవరాల్‌గా టీమిండియాకు (మహిళల మరియు పురుషుల) నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజ క్రీడాకారిణి డియానా ఎడుల్జి (37 ఏళ్ల 184 రోజులు) తొలి స్థానంలో నిలవగా, ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ( ఊరించి... ఉత్కం‘టై’ ) 2017 ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం తాజాగా ఆసియా కప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ‘టై’ గా ముగియడంతో ధోనితో సహా అభిమానలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేఎల్ రాహుల్ రివ్యూ వృథా చేయడం, ఒక్క పరుగు తీస్తే జట్టు విజయం సాధించే దశలో 140 వన్డేల అనుభవం వున్న రవీంద్ర జడేజా నిర్లక్ష్యంగా ఔట్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియాకప్ టోర్నీ ఫైనల్లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్దమైంది. చదవండి: బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా : ధోని -
కోహ్లీకి సాధ్యంకాని ధోనీ రికార్డు
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ తక్కువ కాలంలోనే రాటుదేలాడు. టెస్టు క్రికెట్లో జట్టుకు ఘనవిజయాలు అందించాడు. బ్యాట్స్‌మన్‌గా అద్భుతాలు చేస్తున్నాడు. రికార్డుల దిశగా వెళ్తున్నాడు. కాగా కెప్టెన్‌గా ధోనీ నెలకొల్పిన రికార్డును కొనసాగించడంలో విఫలమయ్యాడు. టెస్టు క్రికెట్లో ధోనీ సారథ్యంలో భారత్ ఎప్పుడూ సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందలేదు. ఆస్ట్రేలియాతో ఎనిమిది టెస్టుల్లో ధోనీసేన విజయం సాధించింది. మూడు సిరీస్ లను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా విరాట్ సారథ్యంలో టీమిండియాకు 19 టెస్టుల్లో ఓటమెరుగని రికార్డు ఉంది. కాగా పుణెలో జరిగిన ఆసీస్‌తో తొలిటెస్టులో కోహ్లీ సేన చిత్తుగా ఓడింది. దీంతో ధోనీ కెప్టెన్సీ రికార్డును కోహ్లీ తిరగరాసే అవకాశం కోల్పోయాడు. 2008-09 సీజన్లో సొంతగడ్డపై ధోనీసేన ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడింది. ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెల్చుకుంది. 2010-11 సీజన్లోనూ ధోనీసేన ఇదే విజయాన్ని పునరావృతం చేసింది. ఇక 2012-13 సీజన్లో భారత్ 4-0తో కంగారూలను చిత్తుగా ఓడించింది.