ఎంఎస్ ధోని (ఫైల్ ఫోటో)
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని అనుకోకుండా టీమిండియాకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో టీమిండియా తరుపున 200 వన్టేలకు నాయకత్వం వహించిన ఘనత మిస్టర్ కూల్‌కు దక్కింది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమెట్ ఖాతాలో మరో రికార్డు చేరిందని ఐసీసీ ట్వీట్ చేసింది. టీమిండియాకు నాయకత్వం వహించిన అతి పెద్ద వయస్కుడిగా (37ఏళ్ల 80రోజులు) మిస్టర్ కూల్ అనుకోని రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్( 36 ఏళ్ల 124 రోజులు) రికార్డును ధోని సవరించాడు. ఇక ఓవరాల్‌గా టీమిండియాకు (మహిళల మరియు పురుషుల) నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజ క్రీడాకారిణి డియానా ఎడుల్జి (37 ఏళ్ల 184 రోజులు) తొలి స్థానంలో నిలవగా, ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ( ఊరించి... ఉత్కం‘టై’ )
2017 ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం తాజాగా ఆసియా కప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ‘టై’ గా ముగియడంతో ధోనితో సహా అభిమానలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేఎల్ రాహుల్ రివ్యూ వృథా చేయడం, ఒక్క పరుగు తీస్తే జట్టు విజయం సాధించే దశలో 140 వన్డేల అనుభవం వున్న రవీంద్ర జడేజా నిర్లక్ష్యంగా ఔట్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియాకప్ టోర్నీ ఫైనల్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్దమైంది.
Comments
Please login to add a commentAdd a comment