
Courtesy: IPL Twitter
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జట్టు ప్రయోజనాల కోసం మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడని మయాంక్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో శిఖర్ ధావన్‌తో కలిసి అగర్వాల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని ఆ జట్టు హార్డ్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో కోసం త్యాగం చేశాడు.
అయితే ఓపెనర్‌గా వచ్చిన బెయిర్‌స్టో అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై బెయిర్‌స్టో అర్ధసెంచరీలు సాధించాడు."మయాంక్ అగర్వాల్ నిజమైన కెప్టెన్. బెయిర్‌స్టోకు అవకాశాన్ని ఇవ్వడం కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే బెయిర్ స్టో కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఊపయోగించుకున్నాడు. కాబట్టి మయాంక్ తీసుకున్న నిర్ణయం సరైనది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్'