PC: IPL.com
ఐపీఎల్-2023 ఫైనల్‌కు అంతా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పైనే ఉంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన గిల్.. కీలకమైన ఫైనల్లో ఎలా రాణిస్తాడో అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక తుదిపోరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొన్ని విలువైన సూచనలు చేశాడు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఎదుర్కోవడానికి తమ ఇద్దరు స్పిన్నర్‌లలో ఒకరిని ముందుగానే ఉపయోగించుకోవాలని మంజ్రేకర్ సలహా ఇచ్చాడు. "ధోని తమ బౌలింగ్ ఎటాక్‌ను ఎలాగో పేసర్ దీపక్ చాహర్‌తో ప్రారంభిస్తాడు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు సాధించే ఛాన్స్ ఉంటుంది.
అయితే గిల్ ఫాస్ట్‌బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కానీ స్పిన్నర్లను ఆడడంలో కాస్త ఇబ్బంది పడతాడు. కాబట్టి చెన్నై కొంచెం ముందుగా వారి స్పిన్నర్లను తీసుకువస్తే బాగుంటుంది. అంతే తప్ప దేశ్‌పాండే బౌలింగ్‌ను గిల్ ఈజీగా మెనెజ్‌చేయగలడు. కాబట్టి తీక్షణ వంటి మణికట్టు స్పిన్నర్లు బౌలింగ్ చేస్తే గిల్ వికెట్ సాధించవచ్చు. ఆతర్వాత జడేజా తన పని తను చేసుకుపోతాడు" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Shubman Gill: గావస్కర్, సచిన్, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు.. వచ్చే సీజన్‌లోనూ: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment