India Vs West Indies 2023: ఐపీఎల్-2023లో దుమ్ములేపాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది.
ఇక తాజా సీజన్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ.. 149.52 స్ట్రైక్‌రేటుతో 474 పరుగులు సాధించాడు. కేకేఆర్ ఫినిషర్‌గా అద్భుతంగా రాణించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కాగా తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్న రింకూ త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఈ యూపీ బ్యాటర్ టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా ఎంట్రీ పక్కా
ఈ నేపథ్యంలో.. ‘‘మా హీరో రింకూ టీమిండియా ఎంట్రీ పక్కా’’ అంటూ అతడి పేరును ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి మాల్దీవ్స్ టూర్ ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
గిల్ సోదరి కామెంట్ వైరల్
ఇందులో తన కండలు చూపిస్తూ షర్ట్‌లెస్‌గా ఉన్న రింకూ ఫొటోకు.. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సోదరి షానీల్ ఇచ్చిన రిప్లై హైలైట్ అవుతోంది. రింకూ పోస్ట్‌పై స్పందిస్తూ.. ‘‘ఓ హీరో’’ అని షానిల్ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ తాజాగా మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
కాగా ఐపీఎల్-2023 టోర్నీ ముగిసిన తర్వాత రింకూ మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక శుబ్‌మన్ సోదరి షానిల్ గిల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించేలా అద్భుత రీతిలో గిల్ ఆడటంతో షానిల్ పేరును ప్రస్తావిస్తూ కొంతమంది ఆకతాయిలు దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. షానిల్‌ను ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇదిలా ఉంటే జూలై 12 నుంచి టీమిండియా వెస్టిండీస్ పర్యటన మొదలుకానుంది.
చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే!
శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా!
రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
Comments
Please login to add a commentAdd a comment