
లండన్: ప్రపంచక్‌పలో భారత్ తరపున కామెంటేటర్లుగా ముగ్గురు నియమించబడ్డారు. వీరిలో హర్షా భోగ్లే, సంజయ్ మంజ్రేకర్, సౌరవ్ గంగూలీలకు చోటు దక్కంది. ఈ మెగా ఈవెంట్‌కు మొత్తం 24 మందితో కూడిన కామెంటరీ బృందాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గురువారం ప్రకటించింది. వీరిలో ఇంగ్లండ్ నుంచి నలుగురు, భారత్, న్యూజిలాండ్ నుంచి ముగ్గురేసి, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ర్టేలియా, పాకిస్తాన్ తరపున ఇద్దరేసి, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే మరో ముగ్గురు మహిళలు కూడా కామెంటరీ ప్యానల్‌లో ఉన్నారు.
వరల్డ్‌కప్ ఐసీసీ కామెంటేటర్ల పూర్తి జాబితా
నాసీర్ హుస్సేన్, మైకేల్ క్లార్క్, ఇయాన్ బిషప్, సౌరవ్ గంగూలీ, మిలేనీ జోన్స్, కుమార సంగక్కరా, మైకేల్ అథర్టన్, అలిసన్ మిచెల్, బ్రెండన్ మెకల్లమ్, గ్రేమ్ స్మిత్, వసీం అక్రమ్, షాన్ పొలాక్, మైఖేల్ స్లేటర్, మార్క్ నికోలస్, మైఖేల్ హోల్డింగ్, ఇషా గుహ, పొమ్మి ఎంబాగ్వా, సంజయ్ మంజ్రేకర్, హర్షా భోగ్లే, సిమోన్ డౌల్, ఇయాన్ స్మిత్, రమీజ్ రాజా, అధర్ అలీ ఖాన్, ఇయాన్ వార్డ్
Comments
Please login to add a commentAdd a comment