వాగుడు ఆపమన్నా.. మంజ్రేకర్‌ వింటేగా! | Manjrekar Says Jadeja A Street Smart Cricketer | Sakshi
Sakshi News home page

వాగుడు ఆపమన్నా.. మంజ్రేకర్‌ వింటేగా!

Published Sat, Jul 6 2019 7:52 PM | Last Updated on Sat, Jul 6 2019 7:57 PM

Manjrekar Says Jadeja A Street Smart Cricketer - Sakshi

లీడ్స్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న సంగతి తెలిసిందే. గత వారం బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ సందర్బంగా రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ నోరు పారేసుకున్నాడు. దీనిక బదులుగా రవీంద్ర జడేజా కూడా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో గొడవ సమసిపోయిందని భావించిన తరుణంలో మరోసారి జడేజాను తక్కువ చేస్తూ మంజ్రేకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కుశాల్‌ మెండీస్‌ వికెట్‌ను పడగొట్టాడు. ఈ సమయంలో స్టార్‌ వ్యాఖ్యాతగా ఉన్న మంజ్రేకర్‌ ‘జడేజా స్మార్ట్‌ గల్లీ క్రికెటర్‌’అంటూ సంభోధించాడు. (చదవండి: ఇక నీ చెత్త వాగుడు ఆపు: జడేజా)

మంజ్రేకర్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు, జడేజా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ క్రికెటర్‌గా యువ ఆటగాళ్లను ప్రోత్సహించకుండా కించపరచడం తగదని మండిపడుతున్నారు. మంజ్రేకర్‌కు నోటి దురుద ఎక్కువని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. చెత్త వాగుడు ఆపమన్నా మంజ్రేకర్‌ వింటేగా అంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. రవీంద్ర జడేజా వంటి బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను అభిమానిని కాదని, అసలు తన దృష్టిలో అతడు ఆల్‌రౌండరే కాదని విమర్శించాడు. అయితే మంజ్రేకర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురైన జడేజా ‘ముందు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో.. ఇక నీ చెత్తవాగుడు ఆపు’అంటూ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement